డొనాల్డ్ ట్రంప్ రహస్యాలు చెప్పినందుకు పులిట్జర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబంపై పరిశోధనాత్మక కథనాలను ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికలకు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన ఆస్తుల గురించి వివరాలను ప్రపంచానికి వెల్లడించినందుకు ఈ అవార్డును ప్రకటించారు. అమెరికా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను బోర్డు ప్రకటించింది. ట్రంప్ కుటుంబ సభ్యులు స్వశక్తితో ఆస్తులను కూడబెట్టలేదని, పన్నుల ఎగవేతకు పాల్పడ్డారని నిరూపించిన న్యూయార్క్ టైమ్స్‌కు ఎక్స్ప్లనేటరీ రిపోర్టింగ్ విభాగంలో బహుమతి వరించిది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ తన అక్రమ సంబంధాలను గోప్యంగా ఉంచేందుకు ఇద్దరు మహిళలకు రహస్యంగా డబ్బు చెల్లించారని బయటపెట్టిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక నేషనల్ రిపోర్టింగ్ క్యాటగిరీలో పులిట్జర్ ప్రైజ్‌ను గెలుచుకున్నది.













