కీళ్ల నొప్పుల నివారణకు కొత్త సూదిమందు
కీళ్ల నొప్పుల నివారణకు పీఆర్పీ అనే సూదిమందును కనిపెట్టినట్లు అమెరికాలోని కెన్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త కొరే తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎముకల విభాగ వైద్యులకు ఈ ఔషధంపై సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కొరే మాట్లాడుతూ కీళ్ల అరుగుదల వల్ల కలిగే నొప్పులకు మందులు లేదంటే శస్త్రచికిత్స తప్పనిసరి అయ్యాయన్నారు. కొత్తగా కనిపెట్టిన పీఆర్పీ మందుతో మోకీలు, కీళ్ల అరుగుదల కారణంగా తలెత్తే నొప్పులను 90 శాతం తగ్గించవచ్చన్నారు. రోగి నుంచి సేకరించిన రక్తాన్ని చిన్నపాటి ప్రక్రియ ద్వారా ఔషధంగా మార్చి, తిరిగి ఇంజక్షన్‌గా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అమెరికా నుంచి వచ్చిన వైద్యుడు చరణ్‌రెడ్డి, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుప్రతి సూపరింటెండెంట్ రాములు, వైద్య కళాల ప్రిన్సిపల్ ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.













