గుంటూరులో నాట్స్ ఆధ్వర్యంలో ప్రతి నోట తెలుగు పద్యం
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో గుంటూరులో ప్రతి నోట తెలుగు పద్యం పేరిట సాహితీ సదస్సును నిర్వహించారు. తెలుగు భాష పరిరక్షణలో భాగంగా ఈ సదస్సును నాట్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు, యువతీయువకులు, రచయితలు పాల్గొన్నారు. తెలుగు భాష వ్యాప్తికి, తెలుగు పద్యం పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నాట్స్ ఆధ్వర్యంలో చేపడతామని చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధులు డా.కొర్రపాటి మధు, మన్నవ మోహనకష్ణ, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.













