NATS: మిస్సోరీలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా మిస్సోరీ (Missouri)లో బాల్విన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. వైద్యం ఖరీదుగా మారిన అమెరికాలో నాట్స్ ఇలా తెలుగువారికి సేవలు అందించడానికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడాన్ని ఓ సంప్రదాయంలా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానికంగా ఉండే తెలుగు వారు సద్వినియోగం చేసుకున్నారు. నాట్స్ సలహా బోర్డు సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఈ శిబిరానికి వచ్చిన రోగులను పరీక్షించి తగు మందులు, వైద్య సూచనలు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిర నిర్వహణలో నాట్స్ మాజీ అధ్యక్షులు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేశ్ బెల్లం,, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సుదీప్ కొల్లిపర్ల, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ అన్వేష్ చాపరాల ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.. తెలుగువారి కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మిస్సోరీ చాప్టర్ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.







