NATS: మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

స్వచ్ఛందంగా సేవలందించిన వైద్యులు, వాలంటీర్లు
భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. మిస్సోరిలో మహాత్మాగాంధీ సెంటర్‌లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అనేక మంది తెలుగువారికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. నాట్స్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు డా. సుధీర్ అట్లూరి, డా. బాపుజీ డార్సి రోగులకు పరీక్షలు చేసి ఉచిత వైద్య సేవలు అందించారు.
నాట్స్ మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సుందీప్ కొల్లిపార, నాగ శ్రీనివాస్ సిస్ట్లతో పాటు పలువురు వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. రోగులకు సహాయం చేయడం, వారి వివరాలు నమోదు చేయడం వైద్యులకు సహకరించడం వంటి పనులను స్వచ్ఛందంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నారు. నాట్స్ మిస్సోరి విభాగం ప్రతి నెల ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి నాట్స్ మిస్సోరి నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.