నాటా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా శిబిరాలు
నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో డిసెంబర్ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నాటా అధ్యక్షుడు గంగసాని రాజేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శిబిరాలను, రైతు సంక్షేమ కార్యక్రమాలను, యువజన దినోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్లో పత్రికా విలేకర్ల సమావేశంలో ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు.
డిసెంబర్ 10 వతేదీన కర్నూలు జిల్లా ఎల్లూరులో ఆరోగ్య శిబిరం, 12వ తేదీన చిత్తూరులో రైతు సంరక్షణ, 15వ తేదీన నెల్లూరులో నాటా నగారా పేరుతో పెద్ద ఎత్తున సాంస్కవృతికోత్సవం, 17వ తేదీన గద్వాలలో ఆరోగ్య శిబిరం, 20వ తేదీన జనగామల సంస్కవృతిక ఉత్సవాలు, 21వ తేదీన వరంగల్ యువజన ఉత్సవాలు 23వ తేదీన వేలవర్తిలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రాజేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలకు డా.రాఘవరెడ్డి, డా.కురసాపతి శ్రీధర్ రెడ్డి, పెనుమాడ శ్రీకాంత్, చిన్నబాబు రెడ్డి, అన్నారెడ్డి శ్రీని వంగిమళ్ళ మొండేస్తూ వెంకట్, డా.ద్వారకనాథరెడ్డి, జయపాల్ రెడ్డి, మల్లు ప్రసాద్, కందిమళ్ళ రవి, జయచంద్రా రెడ్డి భక్తవత్సల రెడ్డి, ప్రభాకరరెడ్డి, దయాసాగర రెడ్డి, జీపీకే మూర్తి తదితరులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.













