అమెరికాలో ఎంపీ కవిత గారి జన్మదిన వేడుకలు
– ముఖ్య అతిథిగా ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
తెలంగాణ జాగృతి సంస్థ వ్యాపస్థాపక అధ్యక్షురాలు, ట్ బి జి కే స్ గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని బుధవారం అట్లాంటా లో తెలంగాణ వాదులు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల హాజరు అయ్యారు. కేక్ కట్ చేసిన అనంతరం మహేష్ బిగాల మాట్లాడుతూ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవహారాలను చూస్తున్న కవిత గారి జన్మదిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందగా ఉంది అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చేయడంలో ఆమె కృషిని కొనియాడారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ USA సలహాదారుడు రామడుగు శివకుమార్, ఉప్పల గోవెర్దన్ రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పల్లా, నిరంజన్ పొద్దుటూరి, గౌతమ్ గోలి, రవిచందర్, శేఖర్ పుట్ట, శ్రీధర్ కొంతాల, శంకర్ రెడ్డి గండ్ర, శ్రీనివాస్ దుర్గం, గణేష్ కాసం, రమేష్ వెనుకదాసుల, బాలు, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













