అట్లాంటా విమాన సర్వీసులకు కృషి : మహేందర్‌రెడ్డి
అట్లాంటాకు నేరుగా విమాన సర్వీసులను నడిపేవిధంగా ఇరుదేశాల ప్రభుత్వాలను ఒప్పించేందుకు కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన అట్లాంటాలోని తెలంగాణ అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, గేట్స్ నాయకుడు శ్రీధర్ తిరుపతి తదితరులతో కలిసి భారత కన్సోలెట్ సురేష్ సింగ్, అధికారులతో సమావేశమైనారు. అలాగే గ్రీట్ అండ్ మీట్లో మంత్రి ప్రవాస భారతీయులను, తెలంగాణ, తెలుగు అసోషియేషన్లతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. భేటీలో ఆటా, గేట్స్ నాయకులు తమకు భారతదేశం నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేవని వివరించారు. ఆటాలో భారతీయులతో దాదాపు 4 లక్షల మంది తెలుగువారు ముఖ్యంగా తెలంగాణవారు ఉన్నారని వీరు హైదరాబాద్ ఢిల్లీ నుండి రాకపోకలకు నేరుగా విమాన సర్వీసులను లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐరోపాలోని లండన్, ఆమ్స్టార్డమ్, లేదా మధ్య ప్రాచ్యంలోని దుబాయి మీదుగా వివిధ ఏర్వేస్తో చేరుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇరుదేశాలతో సంప్రదించి ఎయిర్ ఇండియా సర్వీసులను అట్లాంటాకు నడిపించాలన్నారు. దీంతో స్పందించిన మంత్రి మహేందర్‌రెడ్డి కన్సోలేట్ సురేష్సింగ్తో ఎయిర్ ఇండియా సర్వీసులను అట్లాంటాకు నడిపేవిధంగా చర్చలకు చర్చించారు. రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిస్థితిని వివరించి కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, నితిన్‌గడ్కరీ తదితరులతో భారత ప్రభుత్వాన్ని ఒప్పించి అట్లాంటాకు ఎయిర్ ఇండియా సర్వీసులను నడిపేందుకు కలిసి కట్టుగా కృసి చేస్తామని హామీ ఇచ్చారు. ఆటా, ఘాట, టాటా, గేట్స్ నాయకులు దయకర్‌రెడ్డి, అనిల్, శ్రీధర్, కృష్ణారెడ్డి, నితిన్, ప్రవీణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.













