రచ్చకెక్కిన డొనాల్డ్ ట్రంప్ ఇంటి పోరు!
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం అంటే ఏంటో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా చక్కగా చూపించారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్‌కు ట్రంప్ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా తన కూతురు ఇవాంకాను వేదిక మీదకు పిలిచారు. అప్పటికే వేదిక మీద ఉన్న మెలానియా తన సవతి కూతురును నవ్వుతూ పలకరిస్తూనే క్షణాల వ్యవధిలో మొహం చిట్లించారు. ఇవాంక ట్రంప్ మొదటి భార్య కూతురు. మూడు సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ దీనిని ప్రచార ఆయుధంగా మలుచుకున్నది. మెలానియా, ఇవాంకాకు సత్సంబంధాలు లేవని చాలాకాలంగా అమెరికన్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.













