Atlanta: అట్లాంటాలో ఘనంగా మెగాస్టార్ 70 ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్

తెలుగు సినీ రంగానికి చిరస్థాయి కీర్తి తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవం అట్లాంటా (Atlanta) లో ఘనంగా జరిగింది. ఈ వేడుకను అట్లాంటా మెగాఫ్యాన్స్ (Mega Fans) అత్యంత వైభవంగా నిర్వహించారు. బంజారా బ్యాంక్వెట్ హాల్ లో జరిగిన ఈ ఉత్సవానికి సుమారు 670 మంది అభిమానులు హాజరై, ఆ వేదికను ఒక మెగా జాతరగా మార్చారు. ఈవెంట్ కర్టెన్ రైజర్ ను శ్రీ కరోతు సురేష్ గారు ప్రారంభించగా, అంకరింగ్ బాధ్యతలు శ్రీమతి లావణ్య చేపట్టి సాయంత్రాన్ని ఉత్సాహ భరితంగా మార్చారు. చిన్నారుల నుండి పెద్దల వరకు పాల్గొన్న డ్యాన్స్ రూపకాలు, మెగా స్టెప్స్ అభిమానుల గుండెలను తాకాయి. ప్రముఖ గాయకుడు శ్రీ వెంకట్ చెన్నుభొట్ల తన బృందంతో ( దుర్గ గోర, శ్రీమతి రాగవాహిని, శ్రీమతి శిల్ప ఉప్పులూరు) అద్భుతమైన లైవ్ సింగింగ్ తో మెగా వేదికను కుదిపేశారు. డిజె బీట్స్ అండ్ ఈవెంట్స్ వారి మ్యూజిక్ మిక్స్ హాల్ మొత్తాన్ని ఊపేసింది. ప్రత్యేక ఆకర్షణగా, మెగాస్టార్ చిరంజీవి జీవన యాత్రపై రూపొందించిన ప్రత్యేక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శించబడిరది. ఇందులో ఆయన సినిమాటిక్ ప్రయాణం, సేవా కార్యక్రమాలు, జాతీయ పురస్కారాలు ప్రతిబింబించగా, హాల్ అంతా కేరింతలతో మార్మోగింది. ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా ఎల్‌ఇడి వాల్, దానిపై ప్రదర్శించిన మెగా విజువల్స్. దీన్నిబైట్ గ్రాప్ అధినేత ప్రశాంత్ కొల్లిపర, మాధురి కొల్లిపర అందించారు. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫోటో బూత్ అన్ని సమయాలలో కిటకిటలాడుతూ అభిమానులకు గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కుమారి ఆర్షి సరగడం గణేశ శ్లోకంతో ఆరంభం
చిన్నారులు: అర్జున్ పసుమర్తి, నిమిష పల్లా, మురారి పల్ల, ఆర్షి సరగడం, సుథిక్ష్ రాయల్ కరంగుల, ఇషా కుటల
ద్వారపూడి బ్రదర్స్ (తనీష్, హనీష్) – బాస్ పార్టీ డ్యాన్స్
మహేష్ ద్వారపూడి – చిరు స్టెప్స్
జయని కారుమంచి – చూసా చూశా డ్యాన్స్
పసుపులేటి కిడ్స్, ఎక్కలూరి గ్రూప్ – మాస్ డ్యాన్స్
రాధాకృష్ణ చాట్ల, శ్వేజా కలకుంట్ల – డ్యూయెట్
తరుణ్ కారుమంచి – సోలో
భాను పెర్ని, కీర్తణ కరనం – కపుల్ డ్యాన్స్
చివరగా చిరు తమ్ముళ్లు రఘువీర్ సరగడం, ధీరజ్ కడియాల, కిరణ్ పసుమర్తి, మహేష్ ద్వారపూడి, బద్ర కంటంసెట్టి – మెగా మీటర్‌ను 100% కి పెంచారు!
కల్చరల్ పెర్ఫార్మెన్స్ తో ఆహుతులను అలరించిన కళాకారులకు కెడ్స్ ఐస్ క్రీమ్ వారు గిఫ్ట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది.
ఈవెంట్‌కు విచ్చేసిన అభిమానులకు ఇరాని చాయ్, మిరపకాయ బజ్జీలు, కాజాలు, పిల్లలకు పిజ్జాలు, పెద్దలకు శీతలపానీయాలుతో స్వాగతం పలికారు.
డిన్నర్‌లో వెజ్ `నాన్ వెజ్ స్పెషల్ మెనూతో ఒక మెగా బ్లాస్ట్ ఇచ్చారు. పిస్తా హౌజ్, ఛార్ కోల్ ఎన్ గ్రిల్, ఇండియన్ ఫ్లావర్స్, దోస్తి, మన విందు రెస్టారెంట్లు, హోమ్ ఫుడ్స్ సంజీవ్ ఎక్కలూరి, ఈశ్వర్ వడ్డించిన వంటకాలు వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. సుమారు 900 బాక్స్‌లు ప్యాక్ చేసి, సర్వ్ చేయడం జరిగింది. ఈ బాధ్యతను వెంకటపతి రాజు మండపాటి, భోగాది రాఘవ, మహరాణ యడవల్లి, శ్రీనివాస్ పసుపులేటి, గోపి సమ్మెట తదితరులు సమర్థవంతంగా నిర్వహించారు. సాయంత్రం నుండి రాత్రి 11:45 వరకు టీ, స్నాక్స్, పానీయాల సపోర్ట్ అందించిన మధు కారంగులను అందరూ అభినందించారు.
మెగా ట్రివియాలో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు గిఫ్ట్ కార్డులు బహుమతులుగా అందించారు. రాఫెల్ డ్రాలో విజేతలకు మెగా స్టైల్ గిఫ్టులు ఇచ్చారు. మహిళలకు చీరలు, జాకెట్లు పురుషులకు కుర్తా, పైజామాలు పంపిణీ చేశారు.
ఈ ఈవెంట్‌ను మహరాణ యడవల్లి, నంద కిషోర్, సురేష్ బండారు ఆర్గనైజ్ చేశారు. కల్చరల్ టీమ్‌కు చెందిన ఐశ్వర్య, ప్రియా క్రమబద్ధ ప్రణాళికతో డ్యాన్స్ షోలు నిర్వహించారు. లాజిస్టిక్ టీమ్ సభ్యులైన రవి యెలిసెట్టి, అనురాగ్ పలంకి, రవి కిరణ్ కె, చంద్రకాంత్ అకెళ్ళ, గోపి సమ్మెట, కృష్ణ మేకల, పులకండం, రాజు మండపాటి, భోగాది రాఘవ, సాయి రెగెండ్ల, రాజేష్ తడికమల్ల, నరేష్ తోట, విజేంద్ర బట్టిపాటి, చిన్మయ మంచల, శ్రీమతి ప్రియాంక గడ్డం, మధు కరంగుల, హెమంత్ పెనుమత్స, గోక్యాడ బ్రదర్స్, సంజీవ్ ఎక్కలూరి, సాయి ప్రవీన్ వర్ధనీడి, హరి తోలేటి, కళ్యాణ్ సుంకర, శ్రీమతి పగ్న్య తూరపాటి, సూర్య బుడిర, శివ చిక్కం, పవన్ ఒగేటి, రాజ్ అద్దంకి, సురేష్ దూలిపూడి తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.
సురేష్ బండారు ఓట్ ఆఫ్ థేంక్స్ చెబుతూ అన్నయ్య అంటే అట్లాంటాకు ఉన్న అపూర్యమైన అనుభందాన్ని చక్కగా వివరిస్తూ, స్పాన్సర్స్ అందరికి చిరు జ్ణాపికలు అందించారు. ‘హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిరంజీవి గారికి హీరోలే ఫ్యాన్స్’’ అనే నినాదానికి తగినట్టే, ఈ వేడుక అట్లాంటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వచ్చినవారు వ్యాఖ్యానించడం విశేషం.