అట్లాంటాలో ఎపి జన్మభూమి జయప్రదం
అట్లాంటాలో ఎపి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరారు. రాజధాని నిర్మాణం అనే మహాయఙంలో అందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. రాజధాని నిర్మాణంకోసం మీరు ఇచ్చేది ఓ డాలరైనా సరే అది ఎంతో విలువైనదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్నీరంగాల్లో ముందుకు తీసుకుపోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి చెప్పారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కూడా ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు సతీశ్ వేమనతోపాటు అంజయ్య చౌదరి లావు, మురళీ బొద్దు, భరత్ మద్దినేని తదితరులు పాల్గొన్నారు.













