MATA: మహబూబ్‌నగర్‌లో మాటా ఉచిత మెడికల్ క్యాంప్ సక్సెస్

మాటా (MATA) ఆధ్వర్యంలో మహబూబన్ నగర్ జిల్లాలోని పుదూర్ గ్రామంలో భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వెయ్యికిపైగా కుటుంబాలు ఈ క్యాంప్‌లో వైద్యుల సేవను అందుకున్నాయి. కళ్లు, డెంటల్, ఫిజికల్, ఆర్థో, న్యూరో, కార్డియాక్, ఈఎన్‌టీ, పీడియాట్రిషియన్, గైనకాలజీస్ట్ సహా పలు విభాగాలకు చెందిన వైద్యులు ఈ క్యాంప్‌లో తమ సేవలను ప్రజలకు అందించారు. దీనికితోడు పేషెంట్లకు మూడు నెలలకు సరిపడా మెడిసిన్స్ కూడా అందించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమకు సహకరించిన సాయి ఓరల్ ఫౌండేషన్, భాస్కర్ హాస్పిటల్స్, ఎంఎస్ రెడ్డి ఐ హాస్పిటల్స్, రవి హీలియోస్ హాస్పిటల్స్‌కు మాటా (MATA) కృతజ్ఞతలు తెలియజేసింది.