బిల్‌గేట్స్ ను కలసిన మల్లికాశెరావత్
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ మైక్రోసాఫ్ట్ వ్వవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా… మైక్రోసాఫ్ట్ వ్వవస్థాపకుడు బిల్‌గేట్స్‌ని కలిసి మహిళా సాధికారత గురించి చర్చించిందట. వాషింగ్టన్లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన పార్టీలో వీరు కలవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ విషయం గురించి మల్లికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. ఆయనతో మహిళా సాధికారత గురించి మాట్లాడడం సంతోషంగా అనిపించిందని మల్లికా తన పోస్ట్‌లో పేర్కొంది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 13లోను మల్లికా శెరావత్ సందడి చేశారు.













