అమెరికా మార్కెట్లోకి లూపిన్ కేన్సర్ టాబ్లెట్లు
అమెరికా మార్కెట్లోకి జనరిక్ వెర్షన్ లెవోథైరాక్సిన్ సోడియం టాబ్లెట్లు విడుదల చేసినట్టు దేశీయ ఫార్మా దిగ్గజం లూపిన్ తెలిపింది. థైరాయిడ్ కేన్సర్ రోగులకు సర్జరీ, రేడియోఅయోడిన్ ట్రీట్మెంట్ తర్వాత తలెత్తే సమస్యల నుంచి ఉపశమనం కోసం ఈ టాబ్లెట్లను ఉపయోగిస్తారు. అమెరికా ఎఫ్డీఏ ఇంతకు ముందే ఈ జనరిక్ వెర్సన్ టాబ్లెట్లకు ఆమోదం తెలిపింది. అబ్ వీ ఇంక్ అనే కంపెనీ ప్రస్తుతం ఇందుకోసం సిన్థైరాయిడ్ అనే బ్రాండెడ్ టాబ్లెట్లను అమెరికాలో మార్కెట్ చేస్తోంది. లూపిన్ కంపెనీ ఆ టాబ్లెట్లకు జనరిక్ వెర్షన్లో లెవోథైరాక్సిన్ సోడియం టాబ్లెట్లు విడుదల చేసింది. ఈ సంవత్సరం జనవరితో ముగిసిన 12 నెలల్లో అమెరికా మార్కెట్లో ఈ ఔషధ అమ్మకాలు 250 కోట్ల డాలర్లు ఉన్నట్టు కంపెనీ తెలిపింది.













