భారత వైమానిక దళం కోసం ఎఫ్ 21 వస్తోంది
అమెరికా ఫైటర్ జెట్ ఎఫ్-21 ఇప్పుడు భారత అమ్ములపొదిలో చేరనున్నది. అమెరికా కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసే.. ఈ యుద్ద విమానాలు ఇప్పుడు భారత్ సొంతం కానున్నాయి. భారత్‌కు చెందిన టాటా కంపెనీ.. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఎఫ్-21 యుద్ధ విమానాలను తయారు చేయనున్నది. భారతీయ వైమానిక దళం కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. వాయుశక్తితో భారత్‌ను అత్యంత శక్తివంతంగా మార్చేందుకు ఈ యుద్ధ విమానం తోడ్పడనున్నది. లాక్‌హీడ్ మార్టిన్, టాటా కలయిక.. భారత వైమానిక దళానికి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వనున్నాయి. ఎఫ్-21 తయారీలో అమెరికా, భారత్…రక్షణ వ్యవస్థలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పదిలం చేసుకోనున్నాయి. ఎఫ్-21 తయారీలో భారత్‌లో అనేక ఉద్యోగాలకు అవకాశం లభించనున్నది. అత్యంత తక్కువ ధరలోనే ఈ యుద్ధ విమానాన్ని తయారు చేయనున్నారు.













