అమెరికా శాస్త్రవేత్తల సంచలనం
శూన్యంలో, కాలంలో భూమ్యాకర్షణ శక్తి తరంగాలు సృష్టించే కలకలానికి కారణాన్ని శాస్త్రజ్ఞులు నాలుగోసారి పరిశోధనలో కనుగొన్నారు. రెండు భారీ కృష్ణ బిలాలు ఢీ కొనడంతో అవి ఏర్పడాయని వారు తేల్చారు. వాటి మధ్య 1.8 కాంతి సంవత్సరాల దూరం కూడా ఉందని చెప్పారు. ఆగస్టు 14న ఈ పరిశోధనకు సంబంధించిన సంకేతం ఇటలీలోని విర్గో కేంద్రం డైరెక్టర్ విన్నారు. అమెరికాలోని ఇద్దరు భూమ్యాకర్షణ శక్తి అన్వేషణ కేంద్రం (ఎల్ఐజిఒ) శాస్త్రజ్ఞులు దానిపై విశ్లేషణ సాగించారు. ఈ సూత్రంపై రెండు దేశాల శాస్త్రజ్ఞులు కలిసి పని చేయడం ఇదే తొలిసారి.













