TANA: “ఇది స్టూడెంట్ పెండమిక్ గా భావించాలి. విద్యార్దులు అందరూ జాగర్త గా వుండాలి” : KP సోంపల్లి
గత 10 రోజులుగా అమెరికా లోని భారతీయ విద్యార్ధుల (Indian Students) ను ఆందోళన కు గురిచేస్తున్న విషయం లో బోస్టన్ నగరం లో ఫ్రాంక్లిన్ ఏరియా స్కూల్ కమిటీ కి ఎన్నికైన శ్రీ కే పి సోంపల్లి మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన లేదా వస్తున్న సమస్యను స్టూడెంట్ పెండమిక్ గా వర్ణించారు. శ్రీ కొంపల్లి ప్రస్తుతం న్యూ ఇంగ్లాండ్ రీజియన్ కి తానా (TANA) రీజినల్ కోఆర్డినేటర్ గా కూడా వుండటం వలన, ఆయన అధికారికంగా అమెరికా వారి స్కూల్ కమిటీ లో వుండటం వలన ప్రస్తుత పరిస్థితులలో విద్యార్ధులకు వస్తున్న నోటీస్ లపై పూర్తి వివరణ తెలుగు టైమ్స్ కి ఇచ్చారు.
దాదాపు 2000 కు పైగా భారతీయ విద్యార్ధులకు ఏప్రిల్ 2 వ తేదీ నుంచి నోటీసులు వస్తున్నాయని, ఈ సారి అధికారులు అన్ని వైపుల నుంచి ( విద్యార్ధులకు స్టూడెంట్ వీసా మంజూరు చేసిన కాన్సులేట్ ఆఫీసు నుంచి, వారికి అడ్మిషన్ ఇచ్చిన కాలేజీ నుంచి .. మరి కొన్ని ఆఫీసుల నుంచి) 15 రోజుల గడువు తో నోటీస్ లు రావడం మొదలెట్టాయి.
వెంటనే తానా తన సహాయక చర్యలు మొదలు పెట్టింది.
విద్యార్దులు పోలీస్ రికార్డ్స్ లో ఇప్పటికే వేలు ముద్రలు ఇచ్చి ఉంటే కేసు జటిలం గా ఉందని అర్థం చేసుకోవచ్చు. వేలు ముద్రలు ఇవ్వని ( non guilty) కేసులు కూడా తేలిగ్గా తీసుకోకుండా అధికారులకు తగిన సమాధానం ఇచ్చి కేసు ను ముందుకు తీసుకెళ్లాలి. తానా సంస్థ కొన్ని పట్టణాలలో ఉన్న ఇమ్మిగ్రేషన్ లాయర్ ల వివరాలు అందరికీ అందుబాటు లోకి తెచ్చింది. ఈ లాయర్లు కూడా పూర్తి గా బుక్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఒకో కేసు కి పూర్తి స్థాయి రీటైనేర్ గా ఉండటానికి దాదాపు $10000, ప్రస్తుతం వచ్చిన నోటీస్ కి రిప్లై ఇవ్వడానికి తగు సూచనలు ఇచ్చేందుకు 20 నిముషాల ఫోన్ అపాయింట్మెంట్ కి $200 – $300 తీసుకొంటున్నారు అని తెలుస్తోంది. వారు ఇచ్చే సలహాలు పూర్తిగా సమస్య ను బయట పడేస్తాయి అని చెప్పలేము కానీ, ఆ సలహా సూచనలు అందరికీ తెలియటం మంచిది. విద్యార్దులు తమ బ్యాంకు లలో ఉన్న నగదు ని వెంటనే తీసుకోవడం మంచిదని, ఏ క్షణం లో నైనా ప్రభుత్వ ఉత్తర్వులతో వారి బ్యాంకు అకౌంట్ లను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని చెప్పారని తెలుస్తోంది. కాలేజీ నుంచి నోటీస్ లు వచ్చిన కొందరికి అదే కాలేజీ లో మళ్ళీ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటే ఆ పద్దతి లో ప్రయత్నాలు చేసుకోవచ్చని తెలిపినట్టు తెలుస్తోంది. అయితే కాలేజీ మళ్ళీ అడ్మిషన్ ఇచ్చినా ఆ విద్యార్ధులకు ఉద్యోగం చేసుకొనే అవకాశం కల్పించే OPT ( Optional Practical Training ) రావాలని, లేకపోతే ఆ ప్రయత్నం వృధా అని విద్యార్దులు భావిస్తున్నారు.
కాబట్టి నోటీసులు వచ్చిన, రాకపోయినా విద్యార్దులు అందరూ తగు జాగర్తలు పాటించాలని, ఇండియా లో తల్లి తండ్రులకు అన్ని విషయాలు వివరించి రాబోయే రోజులలో వచ్చే సమస్యలకు తయారుగా ఉండాలని, ముఖ్యంగా ఎలాంటి పోలీస్ కేసుల్లోకి వెళ్లకుండా పూర్తి జాగర్త తో ఉండాలని సలహా ఇచ్చారు. అమెరికా చట్టం ప్రకారం నడుచుకొంటోందని అందరూ అర్ధం చేసుకొని, తమ వ్యక్తిగత జీవన విధానాన్ని మలచుకోవాలని సూచించారు.








