కమలా హ్వారిస్ ప్రచారం …రికార్డు స్థాయిలో విరాళాలు
భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష పదవికి తమ ప్రచారం ప్రారంభించారు. రికార్డు స్థాయిలో విరాళాలు పొందుతున్నారు. ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీకి దిగుతున్నట్లు ఆమె వెల్లడించారు. 24 గంటల వ్యవధిలోనే 10 లక్షల డాలర్ల విరాళాలను సేకరించారు. ట్రంప్‌తో పోటీకి తాను బరిలో ఉన్నట్లు ప్రకటించిన హ్యారిస్ ఎబిసి గుడ్ మాన్నింగ్ అమెరికా ద్వారా విరాళాలకు పిలుపు నిచ్చారు. 24 గంటలు గడిచేసరికి ఆమెకు భారీ స్థాయిలో నిధులు సమకూరాయని ఫ్యాక్స్ న్యూస్ తెలిపింది. తన విజ్ఞప్తిని మన్నించి స్వచ్ఛందంగా సత్వరంగా తనకు విరాళాలు ప్రకటిస్తున్న వారికి థ్యాంక్స్ అంటూ హ్యారిస్ ప్రకటన వెలువరించారు.
నిజానికి 12 గంటలు దాటేలోపునే కమలా హ్యారిస్‌కు పది లక్షల ఫండ్ సమకూరింది. సగటున ఒక్కో అమెరికన్ నుంచి 37 డాలర్ల విరాళం అందినట్లు లెక్కకట్టారని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక వార్త కథనం వెలువడింది. అమెరికన్ల కోసం కమలా హ్యారిస్ అని ముద్రించి ఉన్న టీ షర్టులు, టోపీలు, ప్లకార్డులు వంటివి 11 లక్షల వరకూ ఒక్కరోజునే అందాయి. ట్రంప్‌తో తలపడేందుకు సిద్ధపడుతున్న డెమొక్రాట్లలో కమలా హ్యారిస్ నాలుగో వ్యక్తిగా నిలిచారు.













