కమలా హ్యారిస్‌పై జాతి విద్వేష వ్యాఖ్యలు
అమెరికాలో భారత సంతతికి చెందిన తొలి సెనెటర్, డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న కమలా హ్వారిస్పై ఆన్లైన్లో కొందరు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీలో అగ్రనాయకురాలైన కమల అమెరికాలోనే జన్మించారు. ఆమె తల్లి భారతీయురాలు కాగా, తండ్రి జమైకాకు చెందిన నల్లజాతీయుడు. అయితే ఆమె అమెరికన్ నల్లజాతీయురాలు కాదంటూ ఓ వ్యక్తి ఆన్లైన్లో వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికన్-అమెరికన్ అయిన అలీ అక్బర్ అనే వ్యక్తి గత గురువారం ఓ ట్వీట్ చేస్తూ కమలా హ్వారిస్ అమెరికా నల్లజాతీయురాలు కాదు. ఆమె సగం భారతీయురాలు, సగం జమైకా వ్యక్తి అని అన్నారు. ఆ ట్వీట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ కూడా రీట్వీట్ చేశారు. తనపై వచ్చిన వ్యాఖ్యలను కమల ఖండించారు.













