అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విఫలం : కమలాహారిస్
విపక్ష డెమోక్రాటిక్ పార్టీ నేతలతో పాటు వలసదారుల తరపు లాయర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్ సెనెటర్ కమలా హారిస్ స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితులను ట్రంప్ తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా వీసా నిబంధనలను కఠినతరం చేయాలని చూస్తున్నారు అని విమర్శించారు. కరోనా కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని, ఆయన నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు, వలసదారులపై తన కక్షను తీర్చుకునేందుకు కరోనాను ఒక సాకుగా వాడుకుంటున్నారని నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరం డైరెక్టర్ అలి నూరానీ విమర్శించారు. ఈ నిర్ణయం ద్వారా ట్రంప్ అమెరికా ప్రజల్లో విద్వేషాన్ని నింపుతున్నారని మండిపడ్డారు.













