భారత్, అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యధోరణి పెరిగిపోతుండడంపై అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ప్రాంతంలో చైనా అధికారాన్ని పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. చైనా ఆధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు ఏర్పాటైన క్యాడ్ కూటమికి చెందిన దేశాల ప్రతినిధులు కరోనా తీవ్రతను లెక్కచేయకుండా టోక్కోలో సమావేశమయ్యారు. క్యాడ్ కూటమిలో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. షింజో అబె నుంచి ఇటీవలే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన యెషిహిడె సుగ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.













