భారత్, అమెరికా మధ్య కీలక ఒప్పందం
భారత్`అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదరనుంది. అమెరికా అధ్యక్షు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలాఖరులో తొలిసారిగా భారత్‌లో అధికార పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగానే ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని బహుళ వర్గాలు తెలిపాయి. నిర్ధిష్ట రంగాలకు సంబంధించి ఈ వాణిజ్య ఒప్పందం ఉంటుంది. దీనికి సంబంధించి తుది రూపురేఖలను ఇరు దేశాల అధికారులు ఇప్పుడు రూపొందిస్తున్నారు. ఈ నె 23 నుంచి 26 మధ్యలో ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు వస్తున్నారు. ఇందుకు తగు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ పర్యటన సందర్శన ప్రాంతాలకు అధికార యంత్రాంగం ఇప్పుడు తుది రూపు ఇస్తోంది. అమెరికా అధ్యక్షుడి పర్యటన ప్రధాన భాగం అంతా కూడా దేశ రాజధానిపైనే కేంద్రీకృతం అవుతుంది. మరో చోటికి కూడా పోవానుకుంటే ఏ నగరానికి వెళ్లానేది నిర్ణయించాల్సి ఉంటుంది. ఆగ్రా లేదా అహ్మదాబాద్‌కు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.













