భారత్ కు పాక్ ఆహ్వానం ?
ఒకవైపు ఉగ్రదాడులు, వైమానిక దాడులతో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్న పాకిస్థాన్ మరోవైపు ప్రతిష్ఠాత్మకమైన కర్తార్‌పూర్ కారిడార్‌పై జరిగే సమావేశానికి రావాలని భారత్‌కు ప్రతిపాదనలు పంపింది. దీనికి భారత్ కూడా అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణ ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోవడానికి మార్చి 14న సమావేశమవ్వాలని ఇంతకుముందే ఇరుదేశాలూ నిర్ణయించాయి. అయితే, ఇటీవల జరిగినా పరిణామాలతో ఆ సమావేశం షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా, లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మార్చి 14న జరిగే సమావేశానికి రావాలని గురువారం భారత్‌కు పాక్ ఆహ్వానం పంపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.













