అమెరికాపై భారత్ ఘన విజయం
మలేషియాలో యువ భారత్ జట్టు గర్జించింది. అమెరికాపై గోల్స్ వర్షం కురిపించింది. సుల్తాన్ జోహర్ కప్ హాకీ టోర్నమెంట్లో జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన భారత జట్టు హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. జోహర్ బాహ్రులో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 22-0 గోల్స్‌తో అమెరికాను చిత్తు చిత్తుగా ఓడించింది. కుర్రాళ్ల ప్రదర్శన చూస్తుంటే అలనాటి సీనియర్ జట్టు సాధించిన విజయాలు గుర్తొచ్చాయి. 1932 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో భారత్ 24-1తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లోనూ భారత్ 16-0తో అమెరికాను చిత్తు చేసింది. ఆట రెండో నిమిషంలోనే ప్రతాప్ లాక్రా కొట్టిన గోల్‌తో బోణీ చేసిన భారత ఆటగాళ్లు ఆ తర్వాత రెచ్చిపోయారు.













