హెచ్-1బీ వివాదంపై కోర్టుకెక్కిన ఐటీ సంస్థలు
అమెరికా వలసల విభాగంపై భారతీయ అమెరికన్ ఐటీ సంస్థలు కోర్టుకెక్కాయి. స్వల్ప కాల వ్యవధితో హెచ్-1బీ వీసాల జారీపై దావా వేశాయి. ప్రస్తుతం మూడు నుంచి ఆరేళ్ల కాల వ్యవధితో ఈ వీసాలు జారీచేస్తున్నారు. దీంతో భారత్, చైనాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను భారతీయ అమెరికన్ సంస్థలు నియమించుకుంటున్నాయి. అయితే చాలా ఐటీ సంస్థలు ఈ వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, అమెరికన్ కార్మికులకు ముఖం చాటేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీంతో అమెరికా పౌరసత్వం, వలసల సేవల విభాగం (యూఎస్సీఐఎస్)పై డాలస్‌కు చెందిన ఐటీసెర్వ్ అలయెన్స్ తాజా దావా వేసింది. వెయ్యికిపైగా చిన్న ఐటీ సంస్థల తరపున ఈ కేసును వేస్తున్నట్లు సంస్థ తెలిపింది.













