హిందీభాష నేర్చుకునేందుకు అమెరికన్లు తహతహ
సుసంపన్న భారత సంస్కృతి, బాలీవుడ్ చలనచిత్రాలు.. అమెరికన్లు, ఇతర విదేశీయుల్లో హిందీ భాషను నేర్చేసుకోవాలన్న ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. రాయబార కార్యాలయం నిర్వహించే హిందీ తరగతుల్లో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య 110గా ఉన్నట్లు తెలిపింది. ఇలా పేర్లు నమోదు చేసుకున్న వారిలో భారత సంతతి అమెరికన్లతో పాటు బ్రిటన్, జర్మనీ, ఒమన్, ఉక్రెయిన్, బెలారస్, బంగ్లాదేశ్ తదితర దేశాల వారున్నారు. వారంలో రెండేసీ రోజుల చొప్పున హిందీ బోధన తరగతులు నిర్వహిస్తున్నట్లు అధ్యాపకుడు మోక్షరాజ్ తెలిపారు.













