సియాటెల్, బెల్వ్యూల్లో ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్లు ప్రారంభం
అమెరికాలోని సియాటెల్, బెల్వ్యూ ప్రాంతాల్లో భారత విదేశాంగ శాఖ కొత్తగా ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్‌ను (ఐవీఏసీ)ని ప్రారంభించింది. సియాటెల్ మేయర్ బ్రూస్ హారెల్, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకాష్ గుప్తా ఈ కేంద్రాలను ప్రారంభించారు. భారత వీసాలు, పాస్‌పోర్టులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు, తదితర సేవలను వేగంగా అందించడంలో ఈ ఐవీఏసీ కేంద్రాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. బెల్వ్యూ తూర్పు వైపు నివశించే వారి సౌకర్యార్థం కొత్తగా ఐవీఏసీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 2023లోనే సియాటెల్ ప్రాంతంలో తొలి ఇండియన్ కాన్సులేట్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఇక్కడ ఐవీఏసీ కేంద్రం కూడా ప్రారంభించడం పట్ల సియాటెల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సియాటెల్, బెల్వ్యూ నుంచి భారత్ వెళ్లాలని అనుకునేవారికి ఈ ఐవీఏసీ కేంద్రాలు చాలా ఉపయోగపడతాయని కాన్సుల్ ప్రకాష్ గుప్తా తెలిపారు. ఈ రెండు ఐవీఏసీ కేంద్రాలను కూడా అమెరికాలో వీఎఫ్ఎస్ గ్లోబల్ హెడ్ అమిత్ కుమార్ శర్మ నిర్వహించనున్నారు.







