భారతీయ విద్యార్థులను ఆదుకున్న హోటల్ యజమానులు
కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అమెరికాలోని విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లు కూడా మూతపడటంతో దాదాపు 2,50,000మంది భారతీయ విద్యార్థులు రోడ్డునపడ్డారు. స్వదేశానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు భారత సంతతికి చెందిన హోటల్ యజమానులు బాసటగా నిలిచారు. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు.. కొందరు హోటల్ యజమానులు విద్యార్థులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి వసతితో పాటు భోజనాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా సుమారు 700 హోటళ్లలోని 6000 వేల గదులను భారతీయ విద్యార్థుల వసతికి కేటాయించినట్లు హోటల్ యజమానులు వెల్లడించారు.













