హ్యూస్టన్ మెట్రో ఛైర్మన్గా సంజయ్ రామభద్రన్
ప్రముఖ భారతీయ అమెరికన్ ఇంజనీర్ సంజయ్ రామభద్రన్ తదుపరి హ్యూస్టన్ మెట్రో ఛైర్మన్గా నియమితులయ్యారు. హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఆయనను తాజాగా ఈ పదవికి ఎంపిక చేశారు. దీంతో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రధాన ప్రజా రవాణా సంస్థకు నాయకత్వం వహించబోతున్న మొదటి భారతీయ అమెరికన్ వ్యక్తిగా సంజయ్ నిలిచారు. బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంజయ్ ఆ తరువాత టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2015 నుండి మెట్రో బోర్డులో పని చేస్తున్నారు.













