ఇండో అమెరికన్ ఆర్థికవేత్తకు హార్వర్డ్ అవార్డు
ప్రముఖ ఇండియన్ అమెరికన్ ఆర్థికవేత్త రాజ్ చెట్టికి ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయ జార్జ్ లెడ్లీ అవార్డు లభించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న రాజ్ శెట్టి ఆర్థిక అసమానతలపై అధ్యయనం చేస్తున ఆర్థికవేత్తల బృందానికి డైరెక్టర్గా కూడా ఉన్నారు. విజ్ఞానశాస్త్రానికి, మావవాళికి గొప్ప సేవలు అందించిన హార్వర్డ్ కమ్యూనిటీ సభ్యులకు ప్రతి రెండేళ్లకు ఓసారి ఈ అవార్డులు అందజేస్తారు. ఈయనతో పాటు కొవిడ్ పరీక్ష విధానంపై పరిశోధనలు చేసిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ బయాలజీ ప్రొఫెసర్ మైకేల్ స్ప్రింజర్ సైతం ఈ బహుమతికి ఎంపికయ్యారు.













