ఎవరు గెలిచినా అమెరికాతో కలిసి పనిచేస్తాం : జైశంకర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా, వారితో కలిసి పనిచేస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు బాహాటంగా మద్దతు పలికిన మోదీ సర్కార్ ఇప్పుడు స్వరం మార్చడం గమనార్హం. ప్రవాస భారతీయుల గ్లోబల్ నెట్వర్క్ సంఘం ఇండియాస్పోరా నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. సాధారణంగా భారత్ ఇతర దేశాల ఎన్నికలపై వ్యాఖ్యలు చేయదని, అమెరికా అధ్యక్షులు ఎవరైనప్పటికీ అతడు కానీ, ఆమె కానీ వారితో కలిసి పని చేయగలమన్న పూర్తి విశ్వాసం తమకు ఉందని జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం చాలా కష్టకాలం అనుభవిస్తోందని, ఇది భారత్`అమెరికా మధ్య సహకారం కొనసాగింపునకు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు.







