ఒంగోలు వాసి రికార్డు
దక్షిణ అమెరికాలోని ఆకాంకోగువా శిఖరంపై త్రివర్ణ పతాకం రెపరెప లాడింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఇమాంస ఈనెల 14న ఈ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఇమాంసతో పాటు తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి, స్విడ్జర్లాండ్‌కు చెందిన ఇద్దరు, ఒక జర్మన్( ఐదుగురు) బృందంగా వెళ్లి ఈ ఘనత సాధించారు. వరుసగా నాలుగో పర్వతాన్ని దిగ్విజయంగా అధిరోహించడం ద్వారా ఇమాంస పర్వతారోహణలో రికార్డు సృష్టించారు. గత ఏడాది మే 16న ఎవరెస్ట్ శిఖరంపై దేశ జెండాను ఎగురవేసిన ఆయన అదే సంవత్సరం సెప్టెంబరు 23న యూరప్‌లోని ఎల్బ్రూస్ శిఖరాన్ని, అక్టోబరు 4న ఆఫ్రికాలోని కిలిమంజారోను అధిరోహించాడు. తాజాగా దక్షిణ అమెరికాలోని 6960.8 మీటర్ల ఎత్తైన ఆకాంకోగువా శిఖరాన్ని ఎక్కి దేశ కీర్తిపతాకను ఎగురవేశారు.













