మంచంపై నుండి కూడా ట్వీట్ చేస్తాను
తాను మంచం మీద పడుకుని కూడా కొన్నిసార్లు ట్వీట్ చేస్తానని, అప్పుడప్పుడూ తాను చెబుతుంటే ఇతరులు టైప్ చేసి పోస్ట్ చేస్తుంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇలాంటి సామాజిక మాధ్యమం లేకపోతే తనను తాను సరిదిద్దుకోలేకపోయేవాడినని ఓ బ్రిటీష్ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఆయన దేన్నయినా ట్విటర్ ద్వారానే వెల్లడిస్తారు. తన గురించి అబద్ధపు ప్రచారం జరుగుతోందని, ఇలాంటివాటిపై ప్రజల దృష్టిని మరల్చడానికి ట్వీట్లు చేస్తుంటానని ట్రంప్ అన్నారు. తాను వైట్‌హౌస్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ముఖ్యమైన విషయాల గురించి వీలున్నప్పుడల్లా స్పందిస్తానన్నారు. అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి కూడా ప్రస్తావించారు. ట్విటర్ ఖాతాలో ఆదివారం నాటికి ట్రంప్‌కు 47.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.













