తెలుగు వైద్యుడు రఘురామ్ కు అరుదైన గౌరవం
కిమ్స్ ఉషా లక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బార్సిలోనాలో ఈ నెల 21న ప్రారంభమైన యూరోపియన్ బ్రెస్ట్ కేన్సర్ కాన్ఫరెన్స్‌కు ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి గెస్ట్ స్పీకర్‌గా పాల్గొనే అరుదైన అవకాశం ఆయనకు లభించింది. ఈ సందర్భంగా సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రొమ్ము కేన్సర్‌పై పెద్ద ఎత్తున పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ నిర్వహించి, అవగాహన కల్పించినట్లు తెలిపారు. ముందస్తు పరీక్షల అవశ్యకతను వివరించడంతో చాలా మంది మహిళల ప్రాణాలకు కాపాడినట్లు వివరించారు. నేటితో ముగియనున్న సదస్సుకు 90 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.













