గ్రీన్ కార్డు నిబంధనలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
అమెరికాలో ఉద్యోగ రీత్యా స్థిర నివాసాన్ని ఖరారు చేసే గ్రీన్ కార్డు నిబంధనలపై భారతీయుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే నెలలో జరుగబోయే రెండు దేశాల విదేశీ, రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో ఈ విషయంపై కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రీన్ కార్డు కోసం భారతీయులు చేసుకున్న దరఖాస్తులు 3 లక్షలకు పైగా అమెరికా వద్ద పెండింగ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ లో తీసుకోబోయే నిర్ణయం తరువాత పెండింగ్ దరఖాస్తుల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బీ అమెరికన్ – బై అమెరికన్ అన్న ట్రంప్ నినాదం తరువాత గ్రీన్ కార్డులు, హెచ్1 బీ వీసాలపై భారతీయుల్లో ఆందోళన నెలకొంది. అమెరికాతో భారత్ సంబంధాలు పటిష్టంగా ఉన్న కారణంగా నిబంధనలు సానుకూలంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే వీసా దుర్వినియోగాన్ని అరికట్టే క్రమంలో నిబంధనలు మరింత కఠినతరం అవుతాయన్న ఆందోళన ఓ వైపు ఉన్నా, అర్హులకు అవకాశాలు తప్పకు ఉంటాయన్న భావన కూడా వ్యక్తముతోంది.













