కరోనా సంక్షోభం…అమెరికా భారీ ప్యాకేజీ
మహమ్మారి కరోనా (కోవిడ్ 19) సంక్షోభంతో అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు, కరోనా నివారణ చర్యలకు అగ్రరాజ్యం అమెరికా భారీ ప్యాకేజీ ప్రకటించింది. కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా 484 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తూ రూపొందించిన బిల్లును హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. కరోనా కల్లోలం కారణంగా ఆర్థికంగా నష్టాలు చవిచూసిన చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలని పేర్కొంది. డెమొక్రటిక్ పార్టీ సభ్యుల సారథ్యంలోని ప్రతినిధుల సభ నిర్ణయాన్ని అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. గురువారం సాయంత్రం ఈ బిల్లుపై సంతకం చేసి చట్టంగా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.













