వేడిగా ఉన్న కారులో శానిటైజర్ వద్దు!
వేడిగా ఉన్నప్పుడు కార్లలోపల శానిటైజర్లను వదిలి వెళ్లవద్దని అమెరికాలోని అగ్నిమాపక విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం మండే స్వభావం ఉన్న ఆల్కహాల్ ఆధారిత పదార్థాలతో శానిటైజర్లు తయారుకావడమేనని వాళ్లు చెబుతున్నారు. అప్పటి వరకు ప్రయాణించిన ఓ కారులో అమెరికాలోని ఓ జంట శానిటైజర్‌ను ఉంచి వెళ్లింది. కారులోపల వేడిమి ఎక్కువ ఉండటంతో ఆ శానిటైజర్ బాలిట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఏకంగా కారే మంటలకు ఆహుతి అయింది. ఈ క్రమంలో వేడిగా ఉన్నప్పుడు కార్లలో శానిటైజర్లను ఉంచవద్దని అధికారులు చెబుతున్నారు.













