హెచ్ 1-బీ వీసాదార్లకు కష్టకాలం!
అమెరికాలో హెచ్ 1-బీ వీసాదార్లకు రోజుకో కొత్త కష్టం ఎదురవుతోంది. మెరుగైన వేతనంతో మరో కంపెనీ ఉద్యోగం ఇస్తామంటే, అలా ఇవ్వడానికి వీల్లేదంటూ అమెరికా సంయుక్త రాష్ట్రాల పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) అడ్డుపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాల్ని కఠినతరం చేయటంతో ప్రవాస భారతీయుల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఏదైనా కంపెనీ మంచి వేతనంతో కూడిన ఉద్యోగం ఇస్తామన్నా పొందలేని పరిస్థితి ఏర్పడింది. కంపెనీ యాజమాన్యాల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని యూఎస్సీఐఎస్ వివిధ కారణలు చూపి తిరస్కరిస్తోంది. కొత్త కొలువు ప్రత్యేక వృతినైపుణ్యం అనే విభాగంలోకి రాదుకదా అన్న కారణంలో ఇటీవల పలు కంపెనీలు నియామకాల్ని అడ్డుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్1- బీ వీసాదార్లకు అమెరికా కొలువు కష్టతరమైపోయింది.













