గుంటూరు ఎన్నారైల అద్వర్యంలో “మిరపసాగు – ధరలు” అనే అంశంపై సెమినార్
గుంటూరు మిర్చియార్డు తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో గల తబలా ఇండియన్ రెస్టారెంట్లో “మిరపసాగు – ధరలు” అనే అంశంపై సమావేశం జరిగింది. ఈసమావేశానికి ముఖ్యఅతిధిగా గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరై, మాట్లాడుతూ గుంటూరు మిర్చియార్డు తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. రైతులు పండించే పంటలలో సమతుల్యం పాటిస్తే ధరలను రైతులే నిర్ణయించగల సామర్ద్యము వస్తుందన్నారు. ధరల పతనానికి ముఖ్యకారణం అధికవిస్తీర్ణంలో సాగుచేయడం, అధిక దిగుబడి, విదేశీ ఎగుమతులు తగ్గడం అని అన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసంవత్సరం మిరపసాగు విస్తీర్ణం బాగా పెరిగిందని యార్డ్కువచ్చే టిక్కీలు రోజుకు లక్షనుంచి నాలుగులక్షలకు పెటిగాయని అన్నారు. ఎన్నారైలు అడిగిన పలుప్రశ్నలకు సమాధానం చెప్తూ రైతుకి ఒక క్వింటాకి 1500 రూపాయలు అదనంగా యార్డ్నుంచి నిధులు ఇస్తున్నామన్నారు. యార్డ్లో రైతులకు ఉచిత భోజనం, విశ్రాంతి తీసుకొనే సదుపాయాలు ఏర్పాటుచేశామన్నారు. రైతుశ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, గిట్టుబాటు ధరల విషయంలోకూడా రోజూ అందరితో సమావేశాలు నిర్వహించి సమీక్షిస్తున్నారన్నారు. ప్రవాసాంధ్రులు రైతులకి ఉపయోగపడే విధంగా టెక్నాలజీని అభివృద్ధిచేసి మాతృదేశానికి సేవచేయాలని మన్నవ పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో ఎన్నారైలు శ్రీనివాస్ కొమ్మినేని, వేణుపావులూరి, కిరణ్ తుమ్మల నవీన్ యర్రమనేని, శ్రీనివాస్, వాసునందిపాటి, వెంకట్ యలవర్తి, పూర్ణయలవర్తి, విజయభార్గవ్ మందపాటి, జగదీష్ మోరంపూడి, హేమంత్ గంటి, సిద్దార్థ యలవర్తి, నాగార్జున యలవర్తి, క్రాంతికృష్ణ కొండబోలు, హర్షగొట్టిపాటి, విజయ్, చిరంజీవి, నాగరాజ్, సతీష్ష్రాజేష్,చిన్న, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.













