అమెరికాలో గుజరాత్ వ్యక్తి కాల్చివేత
అమెరికాలో నివసిస్తున్న గుజరాత్‌కు చెందిన ఓ ప్రవాస భారతీయుణ్ని ఆఫ్రికాకు చెందిన అమెరికా జాతీయుడు కాల్చి చంపాడు. జార్జియాలోని అట్లాంటాలో ఈ దుర్ఘటన జరిగింది. హరికృష్ణ అలియాస్ హరీష్మిస్త్రి (51) పెట్రోల్పంపుతో పాటు చిన్నదుకాణం నడుపుతున్నారని వడోదరలో ఉంటున్న ఆయన మేనల్లుడు చెప్పారు. మూడుసార్లు కాల్పులు జరిపిన నల్ల జాతీయుడు గతలో హరికృష్ణ దుకాణంలో పనిచేశారు. 12వ తరగతి చదివిన హరికృష్ణ 20 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆయనకు భార్య షీతల్, ఇద్దరు పిల్లలు నాన్సీ(19), నయన్(4) ఉన్నారు. ఆయన ఇద్దరు సోదరీమణులు కూడా అమెరికాలోనే స్థిరపడ్డారు. శవపంచనామా పూర్తి అయ్యాక, అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.













