అమెరికా విపణికి గ్రాన్యూల్స్, అరబిందో ఔషధాలు
టెన్షన్‌తో వచ్చే తలనొప్పిని అదుపు చేయటానికి బుటాల్బిటాల్, అసెటమినోఫెన్, కేఫిన్ కాంబినేషన్ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) వద్ద మార్కెటింగ్ అనుమతి (ఏఎన్‌డీఏ) తీసుకున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. నెక్స్‌జెన్ ఫార్మా ఇంక్, అనే బహుళ జాతి ఫార్మా కంపెనీకి చెందిన బ్రాండ్‌కు ఇది బయో ఈక్వలెంట్ ఔషధం. మానసిక ఒత్తిడిని (యాంటీ-డిప్రసెంట్) తగ్గించే ప్లూగ్జెటివ్ 10 ఎంజీ, 20ఎంజీ ట్యాబ్లెట్లను ఔషధాన్ని అరబిందో ఫార్మా అమెరికా విపణిలోకి విడుదల చేయనుంది. ఎలీ లిల్లీకి చెందిన ప్రొజాక్ అనే బ్రాండుకు ఇది జనరిక్ ఔషధం.













