16 గ్రామాలకు ప్రవాసాంధ్రుడి ఆపన్న హస్తం
జన్మభూమికి రుణపడి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్నారు గోపాలకృష్ణ శీలంనేని. అమెరికాలోని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఈయన కరోనా క్లిష్ట సమయంలో పుట్టినగడ్డకు ఆపన్న హస్తం అందించాలనా భావించారు. రూ.20 లక్షలు ఖర్చు పెట్టి, కృష్ణా జిల్లాలోని 16 గ్రామాల్లో ప్రజలతోపాటు పేద బ్రహ్మణులు, వివిధ వృత్తులవారికి అండగా నిలుస్తూ 20 రోజులుగా నిత్యావసర సరుకులు, కూరగాయాలు, కోడిగుడ్లు, మాస్కులు, సబ్బులు, శానిటైజర్లు, పంచుతున్నారు. వీటితో పాటు రామచంద్రాపురం, విపరీతలపాడు, పోవూరు, సంగళ్లపాలెం గ్రామాల్లో జ్వరతీవ్రత తెలుసుకునే థర్మామీటర్లు కూడా పంపిణీ చేశారు. స్వగ్రామం తోటరావులపాడులో పాఠశాలకు ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు ఆ చుట్టుపక్కల ఐదు గ్రామాలో పాఠశాలల్లో ఆధునిక బోధనా సామగ్రిని అందించారు.













