జూన్ వరకు ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు
సెర్చింజన్ దిగ్గజం గూగుల్లో పనిచేసే ఉద్యోగులెవరూ జూన్ నెల వరకు ఆఫీసులకు వెళ్లరట. ఈ మేరకు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ నుంచి ఉద్యోగులకు ఓ మెయిల్ వెళ్లిందట. దీని ప్రకారం, కరోనా కారణంగా గూగుల్ వంటి పలు కంపెనీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. జూన్ వరకు ఇలానే పనిచేయాల్సి ఉండొచ్చని మెయిల్లో పిచాయ్ పేర్కొన్నారట. ఆ తర్వాత కూడా ఆఫీసు జీవితం అస్థిరంగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారట. అలాగే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత జీవితాలు చాలా మారిపోతాయని పిచాయ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.













