చైనా యాప్‌ల నిషేధాన్ని సమర్థించిన నిక్కీ హేలీ
భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించడాన్ని ఐక్యరాజ్యసమితి మాజీ అమెరికా అంబాసిడర్ నిక్కీ హేలీ సమర్థించారు. చైనా సంస్థలకు చెందిన యాప్‌లను బహిష్కరించడాన్ని ఆమె స్వాగతించారు. ఇండియన్ మార్కెట్లో విశేష ఆదరణ పొందిన టిక్‌టాక్‌ను కూడా బ్యాన్ చేయడాన్ని నిక్కీ హేలీ ఓ మంచి పరిణామంగా చెప్పారు. చైనా దురాక్రమణకు భారత్ తనదైన రీతిలో ప్రతిస్పందిస్తున్నదని ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశ సౌర్వభౌమాధికారానికి, ఐక్యతకు, భద్రతకు చైనా యాప్‌లతో ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆ దేశ యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే.













