TLCA: టిఎల్ సిఎ క్యాన్సర్ నిర్దారణ శిబిరానికి మంచి స్పందన
న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ నిర్దారణ శిబిరం విజయవంతమైంది. ఫ్లషింగ్ లోని శ్రీ షిర్డి సాయిబాబా టెంపుల్ సహకారంతో టిఎల్ సిఎ ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. పలువురు మహిళలు ఈ శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. తొలిదశలోనే ఈ క్యాన్సర్ ను గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చని డాక్టర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికన్ ఇటాలియన్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఈ పరీక్షలను నిర్వహించారు.
శ్రీ షిర్డి సాయిబాబా టెంపుల్ కు చెందిన డాక్టర్ సుజనీవర్మ, ఇసి కమిటీ సభ్యులు సునీత పోలేపల్లి ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేశారు. సెక్రటరీ శ్రీనివాస్, ప్రవీణ్ కరణం సహకరించారు. 32 రిజిస్ట్రేషన్లు వచ్చాయని, 29మంది హాజరై పరీక్షలు చేయించుకున్నారని ప్రెసిడెంట్ సుమంత్ రామ్‌సెట్టి తెలిపారు. రమాకుమారి వనమా, స్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారని, ఈ కార్యక్రమానికి వచ్చి పరీక్షలు నిర్వహించిన డయాగ్నస్టిక్ టీమ్‌కు, డాక్టర్లకు, ఇసి కమిటీ సభ్యులకు, వలంటీర్లకు అందరికీ సుమంత్ రామ్ సెట్టి ధన్యవాదాలు తెలియజేశారు.







