NATS: మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
తెలుగు వారికి ఉచితంగా వైద్య సేవలు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS). మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని (Medical Camp) ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్ లోని మహాత్మగాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, సెయింట్ లూయిస్ తెలుగు అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, యాడ్స్ మిస్సోరీ సభ్యులు నవీన్ కొమ్మినేని ఈ వైద్య శిబిరం నిర్వహణకు తమవంతు సహకారం అందించారు.







