మహేష్ బిగాల ఆధ్వర్యంలో కరోన భాదితులకు ఉచిత భోజన వితరణ కార్యక్రమం

కీ.శే.శ్రీ బిగాల కృష్ణ మూర్తి గారి దివ్య స్మృతి లో కరోన భాదితులకు మరియు వారి సహాయకుల కొరకు నిర్వహిస్తున్న ఉచిత భోజన తయారీ కేంద్రాన్ని సందర్శించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు TRS – NRI సెల్ కో -ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు TRS – NRI సెల్ కో -ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారి తండ్రి గారయిన కీ.శే. శ్రీ బిగాల కృష్ణ మూర్తి గారి దివ్య స్మృతి లో నిర్వహిస్తున్న ఉచిత భోజన తయారీ కేంద్రాన్ని సందర్శించారు.
* కరోన భాదితులకు మరియు వారి సహాయకులకి ఉచితంగా పంపిణీ చేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం హమాల్ వాడి చౌరస్తా లో కరోన భాదితులకు మరియు వారి సహాయకులకి భోజనం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా TRS – NRI సెల్ కో -ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ..
* కరోన రెండవ దశ విజృంభిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోన బాధితులు, వారి సహాయకులు మరియు నిజామాబాద్ నగరంలో వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోన బాధితులు, వారి సహాయకులు భోజనం దొరకకుండా ఇబ్బంది పడకూడదని వీరి కోసం మా తండ్రి గారి దివ్య స్మృతి లో గత 35 రోజులుగా ఉచితంగా భోజనం వితరణ చేస్తున్నాము.
* అన్ని ధానాల కెల్ల అన్న ధనం గొప్పదని మా తండ్రి గారు చెప్పేవారు.అనేక సందర్భాల్లో వివిధ దేవాలయాల్లో అన్న దానం చేశారు. వారి ఆలోచనలో భాగంగానే వారి నిర్ధేశ్యం ప్రకారం గత సంవత్సరం కరోన మొదటి దశ వ్యాప్తి నేపథ్యంలో కరోన వ్యాధి నివారణ కొరకు పనిచేసిన Front Line Warriors కి వారు పనిచేస్తున్న చోటునే భోజనం వితరణ చేయడం జరిగింది.
* కరోన వ్యాధి వృద్ధి చెందకుండా కరోన నివారణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారికి వ్యక్తి గతంగా సహాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గా మా అన్న గారు శ్రీ గణేష్ బిగాల గారు ముందుకు వచ్చారు.
* మా తండ్రి గారి నిర్ధేశ్యం ప్రకారం 35 రోజులుగా ఈ యొక్క ఉచిత భోజన వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్పొరేటర్ లకి, TRS పార్టీ నాయకులకి, కార్యకర్తలకు మరియు వాలంటీర్స్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను.