బుష్ నన్ను కూడా… నాలుగో బాధితురాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ చేతుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇటీవల వరుసగా ముగ్గురు మహిళలు ఆయన అసభ్య ప్రవర్తనపై నోరువిప్పగా, తాజాగా ఆ జాబితాలోకి మాజీ రిపబ్లికన్ అభ్యర్థి అమండా స్టేపుల్స్ వచ్చి చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పోస్టు చేశారు. 2006లో మైనే స్టేట్ సెనేట్ స్థానం కోసం రిపబ్లికన్ అభ్యర్థిగా ఆమె పోటీచేసినప్పటి ఫోటో అది. నాటి చేదు అనుభవాన్ని స్టేపుల్స్ గుర్తుచేసుకుంటూ, బుష్ నా పిరుదులు పట్టుకుని అసభ్యంగా తాకుతూ నేను అలాంటి ప్రెసిడెంట్‌ని కాదు అంటూ జోక్ వేశారు అని పేర్కొన్నారు. కాగా స్టేపుల్స్ ఆరోపణలపై బుష్ తరపు ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ స్పందిస్తూ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వారందరికీ ప్రెసిడెంట్ బుష్ క్షమాపణలు చెబుతున్నారు అని పేర్కొన్నారు.













