అమెరికాలో మాజీ మంత్రి శిద్దారాఘవరావు పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి శిద్దారాఘవరావు పట్ల అమెరికాలో అభిమానం వెల్లివిరిసింది. ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇండియా నుంచి అమెరికా వరకు అభిమానులు వేడుకలు అమెరికాకు చేరాయి. న్యూయార్క్ సిటీలోని టైం స్క్వైర్ వద్ద మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వేడుకలను అట్టహాసంగా చేసేందుకు ఏర్పాటు చేశారు. న్యూయార్క్ సిటీలోని టైంస్క్వైర్ వద్ద బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఆయన అభిమానులు గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. అమెరికాలో టాప్ సిటీలలో ఒకటైన న్యూయార్క్‌లో ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు ఏర్పాటు చేసిన డిజిటల్ యాడ్లు అక్కడి ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ నెల 10న ఆయన పుట్టినరోజు జిల్లాలో కూడా అభిమానులు భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకించి దర్శి నియోజకవర్గం, ఒంగోలు, సంతనూతలపాడు నియోజక వర్గాలలో ఆయన అభిమానులు వేడుకలను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జన్మదిన వేడుకలు జిల్లా నలుమూలలతో పాటు విదేశాలలో అట్టహాసంగా జరగనున్నాయి. శిద్దా పుట్టినరోజు సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు భారీగా ప్లెక్సీలు కూడా ఆయన అభిమానులు ఏర్పాటు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.













