అమెరికా అతలాకుతలం .. పలు విమానాలు రద్దు
భారీ వర్షాలతో అమెరికా ఈశాన్య రాష్ట్రాల్లో అనేకమందిని తరలించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. మరింతగా వర్షాలు పడతాయనే అంచనాలతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. న్యూయార్క్, కనెక్టికట్లను తాకిన తుపాను నెమ్మదిగా కదులుతూ న్యూఇంగ్లాండ్కు చేరింది. న్యూయార్క్, కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూహ్యాంప్‌షైర్, వెర్మాంట్, మైన్లలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీలో ఒక మహిళ మృత దేహాన్ని గుర్తించారు. ఆమె నివాసం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పెంపుడు శునకంతో కలిసి ఇంటి నుంచి బయటపడే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా అలలు ఎగసిపడడంతో ఆమె నీటిలోపడి చనిపోయారు. తుపాను విధ్వంసానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. కెన్నడీ, లగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో వివానాలు రద్దుయ్యాయి. బోస్టన్లోని లోగాన్ విమానాశ్రయంలో 200కి పైగా విమానాలు రద్దయ్యాయి.













